మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 15:01:50

ఆయుధ లైసెన్స్‌ను దుర్వినియోగం చేస్తే వాట్స‌ప్ చేయండి

ఆయుధ లైసెన్స్‌ను దుర్వినియోగం చేస్తే వాట్స‌ప్ చేయండి

హైద‌రాబాద్ : ఆయుధ లైసెన్స్‌ను ఎవ‌రైనా దుర్వినియోగం చేస్తే 94906 16555 నెంబ‌ర్‌కు వాట్సాప్ చేసి ఫిర్యాదు చేయొచ్చ‌ని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా సీపీ స్పందిస్తూ... పటిష్ట‌మైన ధృవీక‌ర‌ణ అనంత‌రం మాత్ర‌మే స్వీయ ర‌క్ష‌ణ కోసం ఆయుధ లైసెన్స్ జారీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ విష‌యంలో ఏదైనా దుర్వినియోగం జ‌రిగిన‌ట్లు తేలితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ వ్య‌క్తి ఆయుధాల నియ‌మాల‌ను ఉల్ల‌ఘించడంతో అత‌డికి మంజూరు చేసిన లైసెన్స్‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 


logo