శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 19:05:12

రాజీవ్ ర‌హ‌దారి వెంట మ‌రో ద‌శ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం

రాజీవ్ ర‌హ‌దారి వెంట మ‌రో ద‌శ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం

సిద్దిపేట : త‌ఎలంగ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా శామీర్‌పేట నుంచి క‌రీంన‌గ‌ర్  జిల్లా స‌రిహ‌ద్దు వ‌ర‌కు రాజీవ్ ర‌హ‌దారి వెంట మ‌రో ద‌శ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ పి. వెంక‌ట్రామిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. శుక్ర‌వారం అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎంఎన్ఆర్ఇజిఎస్ కింద నిధుల‌ను మొక్క‌ల‌కు స‌పోర్ట్‌గా పాతే క‌ర్ర‌ల‌ను కొనుగోలు చేయాల్సిందిగా సూచించారు. త‌క్ష‌ణ‌మే ర‌హ‌దారి వెంట మొక్క‌లు నాటేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకోవాల్సిందిగా జిల్లా అట‌వీ అధికారి సీహెచ్ శ్రీ‌ధ‌ర్‌ను ఆదేశించారు. మొక్క‌లు నాటేందుకు గుంత‌లు తీసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రైనీ క‌లెక్ట‌ర్ దీప‌క్‌, జిల్లా పంచాయ‌తీ అధికారి సురేశ్‌బాబు, డీఎఫ్‌వో శ్రీ‌ధ‌ర్‌, సిద్దిపేట‌ ఆర్‌డీవో అనంత‌రెడ్డి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.