శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 17:47:17

సిద్దిపేట సిగలో మరో జాతీయ స్థాయి అవార్డు

సిద్దిపేట సిగలో మరో జాతీయ స్థాయి అవార్డు

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా మరో జాతీయ స్థాయి అవార్డును సాధించిందని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి శుక్రవారం  ఒక ప్రకటనలో  తెలిపారు.  ప్రపంచ టాయిలెట్ దినొత్సవం పురస్కరించుకొని  19 నవంబర్ 2020న అవార్డును అందజేస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ టాయిలెట్ దినొత్సవ వేడుకలో భాగంగా మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంపొందించడం, ద్రవ, ఘన పదార్థాల నిర్వహణ, శ్రమదానాలు స్వచ్ఛ భారత్, మిషన్ గ్రామీణ్‌లో  కనబర్చిన ప్రదర్శన ఆధారంగా దేశ వ్యాప్తంగా 20 జిల్లాలను ఎంపిక  చేసి అవార్డులను అందజేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మన  రాష్ట్రం నుంచి సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలను ఎంపిక చేసి అవార్డులు అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే అవార్డు సాధన దిశగా కృషి చేసిన అధికారులను, ప్రజాప్రతినిధులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాను మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.