శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 18:49:12

పెద్దపల్లికి మరో జాతీయ స్థాయి అవార్డు

పెద్దపల్లికి మరో జాతీయ స్థాయి అవార్డు

పెద్దపల్లి  : స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ్‌లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అందరికంటే మెరుగ్గా అమలు చేస్తున్న పెద్దపల్లి జిల్లాకు మరో జాతీయ అవార్డు లభించింది. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ గ్రామీణ్‌'లో అద్భుత ప్రతిభను కనబర్చిన దేశంలోని 20 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి పెద్దపల్లి రెండో జిల్లాగా అవార్డును స్వీకరించింది. 

కరోనా నేపథ్యంలో సదరు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించగా, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ నుంచి పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతి హోళికేరి స్వీకరించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంలో జిల్లా ముందుండడం వల్లే ఈ అవార్డు లభించిందని ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమష్టి పనితీరే అవార్డుకు ప్రధాన కారణమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.