శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 07:38:01

రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్‌ కలకలం

రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌ : నగర శివారులోని రాజేంద్ర నగర్‌లో వరుస కిడ్నాప్‌ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం హిమాయత్‌ సాగర్‌ దర్గా సమీపంలో ఉన్న దంత వైద్యుడు బెహజాట్‌ హుస్సేన్‌ను బురఖాలో వచ్చిన దుండగులు కారులో అతడిని కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాత్రి ఎం.ఎం. పహాడీకి చెందిన గౌస్‌ను దుండగులు కిడ్నాప్‌కు చేశారు. రాత్రి నుంచి గౌస్‌ కనిపించడం లేదని అతడి భార్య రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌస్ కాల్‌ డేటాతోపాటు పలుచోట్ల సీసీకెమెరాల్లోని ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.