శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:07

మన బిడ్డకు అమెరికాలో ఫ్రీ సీటు

మన బిడ్డకు అమెరికాలో ఫ్రీ సీటు

  • ఫారెస్ట్‌ కాలేజీ విద్యార్థినికి ‘అబర్న్‌'లో అడ్మిషన్‌
  • 22 లక్షల ఫీజు మాఫీ.. నెలకు లక్ష స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఈ మధ్యే సూర్యదీపిక అనే విద్యార్థిని అమెరికాలోని ప్రఖ్యాత అబర్న్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ దక్కించుకోగా, ఇప్పుడు మరో విద్యార్థిని ఆ వర్సిటీలో సీటు దక్కించుకుంది. మంచిర్యాలకు చెందిన సుహర్ష ఎమ్మెస్సీ (ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)లో ఉచిత సీటు దక్కించుకుంది. ఆమె తండ్రి సింగరేణిలో పనిచేస్తున్నారు. కాగా, సుహర్షకు ట్యూషన్‌ ఫీజు రూ.22.5 లక్షలు మినహాయిస్తూ వర్సిటీ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు.. నెలకు రూ.1.12లక్షల చొప్పున రెండేండ్ల పాటు స్కాలర్‌షిప్‌ కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. సూర్యదీపిక, సుహర్ష ప్రస్తుతం ఫారెస్ట్‌ కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం రావటం ఆనందంగా ఉందని, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని సుహర్ష తెలిపింది.


logo