మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 02:12:30

మరో 45 బస్తీ దవాఖానలు

మరో 45 బస్తీ దవాఖానలు

  • జీహెచ్‌ఎంసీలో ప్రారంభించిన మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పేదలకు వైద్యసేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే బస్తీ దవాఖానలను ఏర్పాటుచేస్తున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ఒక్కరోజే 45 బస్తీ దవాఖానలను మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లోని సుల్తాన్‌నగర్‌, వెంగళ్‌రావునగర్‌లోని యాదగిరినగర్‌లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం బస్తీ దవాఖానలో ఉన్న ల్యాబ్‌ సౌకర్యాన్ని పరిశీలించారు. వైద్యసేవలపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే 123 బస్తీ దవాఖానలు ఏర్పాటుచేశామని, తాజాగా 45 ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ దవాఖానల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఉచితంగా ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, మందులు లభిస్తాయని వివరించారు.


logo