శనివారం 06 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:11:09

మరో 31 పాజిటివ్‌ కేసులు

మరో 31 పాజిటివ్‌ కేసులు

  • ఒకరి మృతి, 24 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శనివారం కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌ పరిధిలో 30 ఉండగా, రాష్ర్టానికి వలస వచ్చినవారిలో ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,163కు చేరింది. శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోగా, 24 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 382 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదలచేసింది.

కరోనా కేసుల వివరాలు  

వివరాలు
శనివారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
31
1,163
డిశ్చార్జి అయినవారు
24
751
మరణాలు
130
చికిత్స పొందుతున్నవారు
-
382


logo