శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 13:35:00

న‌గరంలో రేపు మ‌రో 16 పంచ‌త‌త్వ పార్కులు ప్రారంభం

న‌గరంలో రేపు మ‌రో 16 పంచ‌త‌త్వ పార్కులు ప్రారంభం

హైద‌రాబాద్ : న‌గ‌రంలో రేపు మ‌రో 16 పంచ‌త‌త్వ పార్కుల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. ఇందిరా పార్కులో రూ. 16 ల‌క్ష‌ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన‌ పంచ‌త‌త్వ పార్కును మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌,  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో క‌లిసి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఇందిరాపార్కులో ఒక ఎక‌రం విస్తీర్ణంలో ఎనిమిది అంశాల‌తో పంచ‌త‌త్వ ఆక్యూప్రెజ‌ర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ది చేసారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో తొలిసారి ఇందిరా పార్కులో పంచ‌త‌త్వ పార్కు ప్రారంభించిన‌ట్లు తెలిపారు. రూ. 4 కోట్ల‌తో ఇందిరా పార్కును మ‌రింత అభివృద్ధి చేస్తామ‌న్నారు. న‌గరంలో వినూత్నంగా పార్కులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. పంచ‌త‌త్వ పార్కులో 50 ర‌కాల ఔష‌ధ మొక్క‌ల‌ను నాటిన‌ట్లు వెల్ల‌డించారు.