గురువారం 09 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:01

మరో 143 మందికి పాజిటివ్‌

మరో 143 మందికి పాజిటివ్‌

  • అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 116 కేసులు
  • 8 మంది మృతి, 40 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శుక్రవారం మరో 143 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3, ఖమ్మం 2, ఆదిలాబాద్‌ 2, మేడ్చల్‌ 2, సంగారెడ్డి 2, కరీంనగర్‌ 2, మంచిర్యాల జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. ఒక్కరోజే ఎనిమిది మంది మృతిచెందగా, 40 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,290 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో 113 మంది మరణించారు. 1,627 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా, మిగిలిన 1,550 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శుక్రవారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
143
3,290
డిశ్చార్జి అయినవారు
40
1,627
మరణాలు
8113
చికిత్స పొందుతున్నవారు
-1,550


logo