e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home Top Slides బడ్జెట్‌పై సంబురాలు

బడ్జెట్‌పై సంబురాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, మార్చి 19: రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో శుక్రవారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కరీంనగర్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. నగరంలోని 14 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.110 కోట్లు, ఏటా రూ.100 కోట్ల చొప్పున కరీంనగర్‌ కార్పొరేషన్‌కు రూ. 350 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఈసారీ మానేరు రివర్‌ ఫ్రంట్‌ సుందరీకరణ కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారని.. జిల్లా ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ ఆధ్వర్యంలో, జిల్లాకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సెవ్వ లక్ష్మి ఆధ్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఉట్నూర్‌లో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, బోథ్‌లో ఎంపీపీ తుల శ్రీనివాస్‌, గుడిహత్నూర్‌లో ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, తాంసిలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఎంపీపీ మంత్రి సురేఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తంచేసిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు.. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: పిడమర్తి రవి
దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని ప్రకటించి, దానికి వెయ్యికోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిమమర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ జేఏసీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పిడమర్తి మాట్లాడుతూ ఇటీవల హాలియా బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని తెస్తానని ప్రకటించారని, అందుకు తగ్గట్టే పథకం తెచ్చి వెయ్యికోట్లు కేటాయించారని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement