మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 01:15:24

సమగ్ర సమాచారంతో వార్షిక అట్లాస్‌

సమగ్ర సమాచారంతో వార్షిక అట్లాస్‌

ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, జనవరి 15 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రూపొందించే వార్షిక అట్లాస్‌పై దృష్టిసారించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అర్థగణాంక, ప్రణాళికాశాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించి, త్వరలో విడుదల చేసే 2021 అట్లాస్‌ సమగ్ర సమాచారంతో ఉండేలా రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించగా, శాఖాపరంగా పలు అంశాలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారు. 

VIDEOS

logo