మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 20:54:14

అన్నపూర్ణ రిజర్వాయర్‌ మూడో మోటర్‌ వెట్ రన్ సక్సెస్‌

అన్నపూర్ణ రిజర్వాయర్‌ మూడో మోటర్‌ వెట్ రన్ సక్సెస్‌

కరీంనగర్‌ : కాళేశ్వరం పదో ప్యాకేజీ భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలు విజయవంతంగా సాగుతున్నాయి. ఈ రోజు మూడో పంప్‌ వెట్ రన్ దిగ్విజయంగా ఎత్తిపోయగా, గోదారి జలాలు జలాశయంలోకి పరుగులు తీశాయి. బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం జలాలు తిప్పాపూర్‌ శివారులోని సర్జ్‌పూల్‌ (మహాబావి)లోకి చేరగా, ఈ నెల 11న మొదటి మోటర్‌ను విజయవంతంగా పరీక్షించారు. అప్పటి నుంచి పలు దఫాలు నడిపిస్తున్నారు.

14న నాలుగో నంబర్‌ మోటర్‌ నడిపించిన అధికారులు, సోమవారం సాయంత్రం 4 గంటల తర్వాత మూడో నంబర్‌ మోటర్‌కు వెట్ రన్ చేశారు. సర్జ్‌పూల్‌ నుంచి జలాలు అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి చేరగా, ఇంజినీరింగ్‌ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగు మోటర్లలో ఇప్పటి వరకు నడిపించిన మూడు మోటర్లు దిగ్విజయంగా ఎత్తిపోశాయని, త్వరలోనే మరో మోటర్‌ (రెండో నంబర్‌) నడిపిస్తామని చెప్పారు.logo
>>>>>>