శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 15:10:47

ఐదున్నర కోట్ల మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ : కేటీఆర్‌ ట్వీట్‌

ఐదున్నర కోట్ల మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ : కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి చాలా మంది తమ జీవనాన్ని కోల్పోవడమే కాకుండా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ కరోనా వ్యాపించే కంటే ముందు కూడా అనాథలు, నిరుపేదలు నగరంలో ఆకలితో అలమటించేవారు. అనాథలు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఆరేళ్ల క్రితం అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రూ. 5కే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఆహారాన్ని అందించిన ప్రభుత్వం.. లాక్‌డౌన్‌ కాలంలో ఉచితంగా ఆహారం అందజేసింది. 

ఆరేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 5.50 కోట్ల మంది ఆకలి తీర్చామని ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 65 లక్షల మందికి ఉచితంగా భోజనం పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అక్షయ పాత్ర, జీహెచ్‌ఎంసీకి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 


logo