గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 14:10:11

అన్నదాతల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : మంత్రి కొప్పుల

అన్నదాతల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : మంత్రి కొప్పుల

పెద్దపల్లి : భూమి తల్లిని నమ్ముకున్న రైతులంతా విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు కష్టాలతో సహవాసం చేస్తుంటారు. అందుకే రైతులకు మంచీ, చెడు చెప్పుకొనేందుకూ ఒక వేదిక కావాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో రూ. 12 లక్షల అంచనా వ్యయంతో  నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాలకు భూమిపూజ చేసి మాట్లాడారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించనున్ననదని వెల్లడించారు.

అన్నదాతలను ఆత్మబంధువులుగా భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 2,604 రైతు వేదికలు నిర్మించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.  రైతులు ఒకే దగ్గర సమావేశమై పంటలు, దిగుబడి, లాభాలు, తదితర అంశాలపై మాట్లాడుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడుతాయన్నారు. అలాగే రైతును రాజును చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశాలు, చర్చలతోపాటు గోదాంలు వినియోగించుకొనేలా రూపకల్పన చేసిందన్నారు. 


అనంతరం అబ్బాపూర్ బీరన్న దేవాలయం లో హైమాస్ట్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు భూమి పూజా చేశారు. కార్యక్రమంలో పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ స్థానిక శాసన సభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భారతి హొళికెరి పాల్గొన్నారు.


logo