మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 03, 2020 , 01:07:05

వలస కూలీలకు నిత్యాన్నదానం

వలస కూలీలకు నిత్యాన్నదానం

-మాజీ ఎంపీ కవిత దాతృత్వం 

-లాక్‌డౌన్‌ రోజుల్లో అన్నదానం

నమస్తే తెలంగాణ ప్రతినిధి, నిజామాబాద్‌: నిరుపేదల ఆకలి తీర్చేందుకు నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందుకొచ్చారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వలసకూలీల కడుపు నింపేందుకు నిత్యాన్నదానం ప్రారంభించారు. నగర శివారులోని రైస్‌మిల్లులు, ఇతర కంపెనీల్లో పనిచేసే కూలీలు, గంజ్‌లోని హమాలీల కోసం గురువారం ఉచిత భోజన కార్యక్రమాన్ని నగరంలోని లలితామహల్‌ టాకీస్‌ దగ్గర ప్రారంభించారు. నిత్యం 500మందికి తగ్గకుండా భోజనానికి ఏర్పాట్లు చేశారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు, మేయర్‌ నీతూ కిరణ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా కవిత ఆదేశాల మేరకు జగిత్యాల  జిల్లా దవాఖాన రోగులకు, వారి బంధువుల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని గురువారం జెడ్పీ చైర్‌పర్సన్‌ వసంతతో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రారంభించారు.  


logo