ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 00:30:57

రామా చంద్రమౌళికి అంజిరెడ్డి పురస్కారం

రామా చంద్రమౌళికి అంజిరెడ్డి పురస్కారం

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే కే అంజిరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత రామాచంద్రమౌళికి ప్రకటించారు. జూలై ఒకటో తేదీన సారస్వత పరిషత్‌ హాల్‌లో సంస్థ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి.. ఈ పురస్కారాన్ని అందజేస్తారని ప్రధాన కార్యదర్శి చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సారస్వత పరిషత్‌ హాల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారని పేర్కొన్నారు. సాహిత్యాభిమానుల కోసం ‘ఆధునిక తెలుగు కథ’ అనే అంశంపై చంద్రమౌళి ప్రసంగిస్తారని చెన్నయ్య వెల్లడించారు. 


logo