శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 14:49:24

మద్యం షాపుల వద్ద పరిస్థితిని పరిశీలించిన సీపీ అంజనీ కుమార్‌

మద్యం షాపుల వద్ద పరిస్థితిని పరిశీలించిన సీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు మద్యం దుకాణాల దగ్గర పరిస్థితిని సీపీ అంజనీ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతో మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో దాదాపు 178 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతి మద్యం షాపు దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తాం. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. 


logo