శనివారం 06 జూన్ 2020
Telangana - May 01, 2020 , 14:24:55

మే 7 వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటించాలి: సీపీ అంజనీకుమార్‌

మే 7 వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటించాలి: సీపీ అంజనీకుమార్‌

 హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న పేదలకు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. జియాగూడ, కార్వాన్‌, గోల్కొండ తదితర ప్రాంతాల్లో  ఉన్న   పేదలకు 16 రకాల సరకులు అందించారు. నగరంలోని పాలు ప్రాంతాల్లో స్థానిక దాతలు, పోలీస్‌ అధికారుల ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు సీపీ వివరించారు.

మెహిదీపట్నం రైతుబజార్‌ ముందు పోలీస్‌ సిబ్బందికి థర్మల్‌ స్టీల్‌ వాటల్‌ బాటిళ్లను అందించారు.  ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు పంపిణీ చేశామని సీపీ తెలిపారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటించాలని కోరారు. మే 7 వరకు ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ పాటించాలని విజ్ఞప్తి చేశారు. 


logo