హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న అనిల్ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా ఆయనను నియమిస్తూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న టీ ప్రభాకర్ రావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో అనిల్ కుమార్‌కు అవకాశం దక్కింది. అనిల్ కుమార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.