హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా 1996 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అనిల్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌లో ఫుల్ అడిషనల్ చార్జిలో ఉన్న టీ ప్రభాకర్‌రావును రిలీవ్చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ శాంతిభద్రతల అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.