శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:31:19

పసుపు తాడే.. ఉరితాడై

పసుపు తాడే.. ఉరితాడై

దంతాలపల్లి(మహబూబాబాద్‌): మూడుముళ్ల బంధానికి ప్రతిరూపమైన పసుపు తాడే ఓ మహిళకు ఉరితాడై ప్రాణం తీసింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన కనుకుంట్ల ఎల్లమ్మ (55) గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్నది. శుక్రవారం ఉదయం ఆమె తన ఇంటికి తాళం వేసి తాళంచెవిని పసుపుతాడుకు కట్టుకున్నది. రోజులాగే విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన ఎల్లమ్మ తాళం తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. ఈ క్రమంలో తాళంచెవి తాళంలో ఇరుక్కొని పసుపు తాడు ఎల్లమ్మ మెడకు బిగుసుకుని ఉరిపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. 


logo