బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:31:51

ఇంటివద్దకే అంగన్‌వాడి సరుకులు

ఇంటివద్దకే అంగన్‌వాడి సరుకులు

  • మంత్రి సత్యవతి ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్‌వాడి కేంద్రాలను మూసివేయాలని, అంగన్‌వాడి సరుకులను లబ్ధిదారుల ఇంటికే పంపించాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు. అంగన్‌వాడి కేంద్రాల మూసివేత అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలుచేశారు. అంగన్‌వాడి సరుకుల పంపిణీని గ్రామ కమిటీల ద్వారా చేపట్టాలని చెప్పారు. గర్భిణుల జాబితా సిద్ధం చేసుకుని.. వారికి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. 

logo