బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:38:09

తుప్పు లారీలను బస్సులుగా మార్చి!

తుప్పు లారీలను బస్సులుగా మార్చి!

  • సుప్రీం నిబంధనలు ఉల్లంఘించిన దివాకర్‌ ట్రావెల్స్‌ 
  • ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీఎస్‌3 వాహనాలను బీఎస్‌4గా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసి విక్రయిస్తున్నారన్న కేసులో టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వీరిని అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఈ వ్యవహారంపై ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. తుప్పు పేరిట కొనుగోలు చేసిన లారీ చాసిస్‌లను సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయించారని తెలిపారు. 2018లో నాగాలాండ్‌లో ఈ వాహనాలను బీఎస్‌4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. లోతుగా విచారణ చేయగా మొత్తం 154 లారీ చాసిస్‌లను స్క్రాబ్‌ కింద కొనుగోలు చేసినట్టు వెల్లడైందన్నారు. వీటిలో నాలుగు లారీలను బస్సులుగా కూడా మార్చితిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.  logo