శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 19:11:22

కరోనా పరిస్థితిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల

కరోనా పరిస్థితిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల

అమరావతి: ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు అయ్యాయి. 135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా వారిలో 108 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చింది. మిగిలిన 24 మంది రక్త నమూనాల కోసం నిరీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1006 మంది అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించాం. 28 రోజుల పరిశీలన తరువాత 259 మందిని ఇళ్లకు పంపించాం. 711 మంది ఇళ్లల్లోనే స్వీయ నిర్బందంలో ఉన్నారు. ప్రస్తుతం 36 మంది వివిధ ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. 


logo