శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 20:18:09

కరోనా లక్షణాలు కనిపిస్తే 104కు ఫోన్‌ చేయండి...

కరోనా లక్షణాలు కనిపిస్తే 104కు ఫోన్‌ చేయండి...

అమరావతి: కరోనాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఏపీలో ఇంత వరకు 6 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ రాగా, అతను కోలుకున్నాడు. విదేశాల నుంచి వచ్చిన 13,301 మందిలో 11,206 మంది స్వియ నియంత్రణలో వారివారి ఇండ్లలో ఉన్నారు. 2222 మందికి  హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. 178 శాంపిళ్లు పరిక్షిస్తే 150 శాంపిల్స్‌ నెగిటివ్‌ వచ్చాయి. మరో 22 శాంపిల్స్‌ రిపోర్టులు రావాలి. ఏపీలోని ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్‌ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతీ జిల్లా కేంద్రంలో 200 పడకల కోవిడ్‌ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మీ చుట్టుపక్కల ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే 104 నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని సీఎం విజ్ఞప్తి చేశారు.


logo