శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:15:32

అంతర్రాష్ట్ర సర్వీస్‌లపై కుదరని ఒప్పందం!

అంతర్రాష్ట్ర సర్వీస్‌లపై కుదరని ఒప్పందం!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో పలు దఫాలుగా అధికారులు భేటీ అయినా మార్గం సుగమం కాలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి తెలంగాణకు లేఖ రాశారు. చర్చలు కొలిక్కిరాని దృష్ట్యా.. ముందుగా చెరో వంద బస్సులు నడుపుదామని ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనిపై తెలంగాణ ఏ నిర్ణయాన్ని వెల్లడిస్తుందనేది తేలాల్సి ఉన్నది.


logo