ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:14

మాస్క్‌ లేదని లాఠీ దెబ్బలు

మాస్క్‌ లేదని లాఠీ దెబ్బలు

  • ఏపీ ప్రకాశం జిల్లాలో యువకుడి మృతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. చీరాలలో మూడ్రోజుల కిందట కిరణ్‌ అనే యువకుడు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. ఎస్సై విజయ్‌కుమార్‌ వారిని ఆపి మాస్క్‌ ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా విజృంభిస్తుంటే ఇంత నిర్లక్ష్యమా అని లాఠీతో కొట్టారు. కిరణ్‌ స్పృహతప్పి పడిపోగా చీరాల దవాఖానకు తరలించారు. అక్కడినుంచి గుంటూరులోని దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసు దెబ్బల కారణంగానే కిరణ్‌ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఎస్సైని సస్పెండ్‌ చేయాలని ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి.logo