సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:58:58

పబ్బం గడుస్తుందా..బొంకెయ్‌!

పబ్బం గడుస్తుందా..బొంకెయ్‌!

  • అబద్ధాల గొంతుక ఆంధ్రజ్యోతి 
  • ప్రతి అభివృద్ధి పనికీ మోకాలడ్డు
  • అన్నింటా రంధ్రాన్వేషణే లక్ష్యం
  • తప్పుడు రాతలు.. అసత్య కథనాలు
  • ప్రజలకు మంచినీళ్లిస్తమన్నా తప్పే
  • రైతులకు కాళేశ్వరం కట్టినా తప్పే
  • హైదరాబాద్‌ అభివృద్ధిపైనా కూతలు

నష్టమేమున్నది.. పడేసేయ్‌ నాలుగు అభాండాలు.. ఇదీ అబద్ధాల ఆర్కే తీరు. కేసీఆర్‌ చేసే పని ఎంత మంచిది అయితేనేం? తను చూసే చూపే తప్పైనప్పుడు! సమగ్ర సర్వే తప్పే.. కాళేశ్వరం కట్టినా తప్పే.. భగీరథతో మంచినీళ్లిస్తామన్నా తప్పే. ఆంధ్రాతో విడిపోవడంతో తెలంగాణ అదృష్టం పోయినట్టే! ఇక అఘోరించండి.. మీ ఖర్మకు ఎవడేం చేస్తాడన్న రీతిలో తెలంగాణ ప్రజలపై అక్కసు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎన్నుకొన్న నాయకుడికి ఏమీ తెలియదన్నట్టు.. తనకు మాత్రమే అన్నీ తెలుసునన్నట్టు ప్రవచనాలు. ప్రజాతీర్పునే అవమానపరిచే రాతలు, కూతలు. ఈ వ్యతిరేకత ఎంత ముదిరిందంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక్క పనిని కూడా ఎన్నడూ  ప్రశంసించలేదు. దేశదేశాల వాళ్లు, ప్రతిపక్ష  ప్రభుత్వాల వాళ్లు వచ్చి పొగిడినా.. రాధాకృష్ణకు.. ఆంధ్రజ్యోతికి మంచి కనిపించదు. మనువొకచోట, మనసొకచోట అన్నట్టు జరిగితే ఆర్కేలాగే ఉంటుంది పరిస్థితి. తెలంగాణ రావొద్దని, రాదని గాఢంగా ప్రయత్నించి విఫలమైతే ఎవరికైనా మనసు కకావికలం కాక తప్పదు మరి. ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ, ఇక్కడి గాలి పీలుస్తూ, పరాయి పాట, కిరాయి బతుకుల నుంచి తెలంగాణపై ప్రేమను ఆశించడం మన తప్పు. అయినా ఎన్నటికైనా.. ఆంధ్రజ్యోతి ఆంధ్రా-జ్యోతే అవుతుంది కానీ తెలంగాణ జ్యోతి అవుతుందా?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ర్టాలు బాగుపడాలని అక్షరాలు పేరిస్తే అది జర్నలిజం. మరి.. ఒక రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి.. అది పక్క రాష్ర్టానికి వరంగా మారాలని క్షుద్రాక్షరాలు పేరిస్తే..? అది లత్కోరు రాధాకృష్ణ మార్కు జర్నలిజం. తెలంగాణ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించిందే మొదలు.. దానికి ఎలా తూట్లు పొడవాలో కథనాలు.. తాననుకున్నది కాకుండా పథకం దిగ్విజయంగా అమల్లోకి వచ్చేసరికి ఆ అమలును వక్రీకరిస్తూ రాతలు.. నైతికత అన్న పదానికి అర్థమే తెలియక పాతాళానికి దిగజారిపోయి తెలంగాణను అన్ని విధాలా అప్రతిష్ఠ పాలుజేసే దుర్మార్గం.

హైదరాబాద్‌లోని పరిశ్రమలు వందలాదిగా రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయంటూ చంద్రబాబు కుట్రల్ని అమలు చేసే ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించలేదు. మెట్రో రైలును ఆపేందుకు ఆర్కే తన పెన్నులో నింపుకున్న ఎర్రసిరా ఖాళీ అయిందే తప్ప మెట్రో కూతను ఆపలేకపోయాడు. కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, పారిశ్రామిక విధానం.. ఒకటీ అరా కాదు.. ఈ ఆరేండ్లలో శకునపక్షి ఆంధ్రజ్యోతి తెలంగాణపై ఏడుస్తూ వండి వార్చిన కథనాలు మచ్చుకు కొన్నింటిని చూస్తేనే తెలంగాణపై గొంతునిండా ఎంత విషాన్ని నింపుకొన్నారో అర్థమవుతుంది. ఇంకా తవ్వినా కొద్దీ బయటపడేవాటిని చూస్తే ఏమవుతుందో అర్థంచేసుకోవచ్చు.  

ఇవీ.. ఆర్కే లత్కోరు రాతలు..

పరిశ్రమలు రావన్నారు.. టాప్‌ కంపెనీలే వచ్చాయి 

2014 జూన్‌, 3 

పారిశ్రామిక తెలంగాణ.. అతి పెద్ద సవాల్‌-60% పరిశ్రమలు సీమాంధ్రులవే

2014 జూన్‌, 11

చలో ఆంధ్రప్రదేశ్‌- హైదరాబాద్‌ నుంచి ఇప్పటికే 800 కంపెనీలు - లైన్‌లో మరికొన్ని వందలు 

2014 నవంబర్‌, 28

కర్ణాటక కాలింగ్‌!-హైదరాబాద్‌ ఫార్మాపై వల

2018 జూలై, 26 

కాలుష్య పరిశ్రమ-టీఎస్‌ ఐపాస్‌లో 75% పరిశ్రమలు కాలుష్య కారకాలే

ఆంధ్రజ్యోతి పైత్యం: 

రాష్ట్రం ఏర్పడిన క్షణం నుంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చిమ్మిన విషమిది. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన మర్నాడే హైదరాబాద్‌ చుట్టుపక్కల పరిశ్రమల్లో 60% సీమాంధ్రులవేనని, వాటిని కాపాడుకోవడం తెలంగాణ సీఎంకు పెద్ద సవాలు అని ఒక కథను వార్చారు. ఇక ఏపీలో సీఎంగా చంద్రబాబు కావడంతో వందల పరిశ్రమలు ఏపీకి వెళ్లిపోయాయని.. వందలకొద్దీ క్యూ కట్టాయని మరో కథనం. కానీ, ఈ బురిడీ ఆర్కే, ఆయన జిగిరీ దోస్త్‌ బాబుగారి పగటి కలలు నెరవేరలేదు. ఇది తట్టుకోలేని రాధాకృష్ణ మరో రాక్షసకృతి రచించాడు. ఇప్పుడు హైదరాబాద్‌ పరిశ్రమలు కర్ణాటక పోతున్నాయని.. ఇదీ నిజం కాకపోయేసరికి టీఎస్‌ఐపాస్‌ నుంచి అనుమతి పొందిన 70 శాతం పరిశ్రమలు కాలుష్య కారకాలంటూ మరో రాత. 

ఇదీ వాస్తవం: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్‌తో  వందల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. గత ఆరేండ్లలో అదనంగా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. కుట్రల ఆర్కే కోరుకున్నట్టు.. చంద్రబాబు తోకపట్టుకొని పారిశ్రామికవేత్తలు ఎక్కడికి పడితే అక్కడికి పోరు. వీళ్లు అనుకొన్నట్టు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ హైదరాబాద్‌ శివారు కూడా దాటలేదు. చివరకు ఏపీకి దక్కని పరిశ్రమ తెలంగాణలోనూ దక్కొద్దని.. కర్ణాటకకు పోతున్నాయంటూ రాధాకృష్ణ రాసిన అబద్ధాలు.. ఆయనలో తెలంగాణపై ఎంత విషం ఉన్నదో అర్థమవుతుంది.

భగీరథ కదలలేదన్నారు.. ప్రతి ఇంటికీ నీళ్లొచ్చాయి

2014 నవంబర్‌ 28 

నీరు విడిచి గ్రిడ్‌ సాము!  దుర్భిక్ష కచ్‌ కోసం రూపొందించిన నమూనా మనకెందుకు?

2020 జనవరి 12 

కదలని భగీరథం - పట్టణాలు, నగరాల్లో నీటి గోసే... కొన్నిచోట్ల ఇప్పటికీ ట్యాంకర్లే దిక్కు

ఆంధ్రజ్యోతి పైత్యం: 

ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందిచడం కోసం మిషన్‌ భగీరథను సంకల్పిస్తే.. అది అసాధ్యం, అనర్ధం అంటూ శకుని పక్షిలా రాధాకృష్ణ కథనాలు రాస్తాడు. తీరా అమలుచేసిన తర్వాత ముందుకు సాగడంలేదు.. జనం నీటిగోస పడుతున్నారని మరో అబద్ధపు కథనం రాస్తాడు.

ఇదీ వాస్తవం: తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మంచినీటి గోసలన్నీ ఇన్నీ కావు. ఊళ్లల్లో ఆర్వో మిషన్లతో బండ్లు వస్తే పైసలు పెట్టి నీళ్లు కొనుక్కొనేవాళ్లు. నల్లగొండ లాంటి జిల్లాల్లో ఫ్లోరైడ్‌ సమస్యతో ఒక తరానికి తరం ఎలా నాశనమైందో ఇప్పటికీ కండ్లముందు కనిపిస్తుంది. వీటికి పరిష్కారంగా ఉపరితల జలాలను ఇంటింటికీ అందించాలన్న సంకల్పంతో మిషన్‌ భగీరథ చేపట్టారు. ఇది దేశానికే రోల్‌మోడల్‌గా మారింది. 44 వేల కోట్ల రూపాయలతో సుమారు లక్షన్నర కిలోమీటర్ల పైప్‌లైన్లు, 35 వేలకు పైగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇంటర్నెట్‌కోసం అంతర్లీనంగా ఫైబర్‌గ్రిడ్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందుతున్నది. మొన్న ఎండకాలంలో ఎక్కడా మహిళల నీటి కష్టాలు కనిపించనేలేదు. 11 రాష్ర్టాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని అమలుకు సిద్ధమయ్యాయి. మొన్నటికి మొన్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే పథకాన్ని ప్రకటించిన విషయమూ  రాధాకృష్ణ గుర్తింపునకు నోచుకోలేదు. 

రేషన్‌ కార్డులు కట్‌ అన్నారు.. 87 లక్షల కార్డులిచ్చారు

2014 నవంబర్‌ 01 

సగం మందికి రేషన్‌ కార్డు కట్‌! - రాజధానిలో 40 శాతం కుటుంబాలకే రేషన్‌

ఆంధ్రజ్యోతి పైత్యం: 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే రాష్ట్రంలో 50 శాతం రేషన్‌ కార్డులను ప్రభుత్వం తొలగించనున్నదంటూ నిరుపేదల్ని భయాందోళనకు గురిచేసే కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో 60 శాతం తొలగిస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం తొలగిస్తారని కథనంలో పేర్కొన్నది. 

జరిగిన వాస్తవం: ఉమ్మడి రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు ఇచ్చారనేది జగమెరిగిన సత్యం. అందుకే నిరుపేదలను ఆదుకోవాల్సిన తెల్ల రేషన్‌కార్డులు అనర్హులకు ఉండొద్దనే సదుద్దేశంతో కేవలం అనర్హులుగా గుర్తించిన వారి కార్డులను రద్దు చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేదకూ కార్డును తొలగించలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికీ 87 లక్షల తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయి. గతంలో కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున గరిష్ఠంగా పదహారు కిలోల బియ్యం ఇస్తే.. తెలంగాణ సర్కారు ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున అసలు గరిష్ఠ పరిమితి లేకుండా నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. 

రైతుబంధునూ తప్పుపట్టారు.. అన్నదాత ఆనందంగా ఉన్నాడు

2020 జూన్‌, 06 -1 

చెప్పిన పంట వేశాకే రైతుబంధు - సాగు లెక్కలు తేలిన తర్వాతే ఖాతాల్లో జమ

ఆంధ్రజ్యోతి పైత్యం: 

దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప పథకం రైతుబంధు. రాధాకృష్ణ ఈ పథకాన్నీ వదిలిపెట్టలేదు. ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెంచే విఫల ప్రయత్నంలో భాగమే ఈ కథనం. ప్రభుత్వం చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వదు.. అందుకే పంట వేసిన తర్వాతగానీ రైతులకు పెట్టుబడిసాయం అందదు.. అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని వండి వార్చింది. 

ఇదీ వాస్తవం: సమైక్య రాష్ట్రంలో అరిగోస తీసిన తెలంగాణ రైతు ఇప్పుడు ఏ దశలోనూ నష్టపోకుండా ఉండాలనే బృహత్తర ఆశయంతో ప్రభుత్వం నియంత్రితసాగు విధానాన్ని ప్రవేశపెట్టింది. అందరూ ఒకే పంట వేసి మార్కెట్లో ధర లేక నష్టపోకుండా ఉండేందుకు డిమాండుకు అనుగుణంగా వివిధ రకాల పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా అవగాహన పరిచి, రైతు లాభపడేందుకే ఈ విధానాన్ని అమలు చేసిందే కానీ రైతుబంధు ఆపలేదు.  రికార్డుస్థాయిలో గత జూన్‌ 24-26 తేదీలు అంటే కేవలం మూడు రోజుల్లో కోటి 33 లక్షల 77వేల ఎకరాలకు సంబంధించి 54.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,888.43 కోట్ల రైతుబంధు నిధులను వారి ఖాతాలో జమ చేసింది. ముఖ్యంగా జూన్‌ 22వ తేదీ ఒక్క రోజే 50.84 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.5,294.53 కోట్లు జమ అయ్యాయి.  

కాళేశ్వరం నీళ్లకు యూజర్‌ చార్జీలన్నారు.. రూపాయి లేకుండా వద్దన్నా నీళ్లొస్తున్నాయి

2015 అక్టోబర్‌, 07 - 

రైతుకు ఎత్తి‘మోత’ - కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లపై యూజర్‌ చార్జీలు, పన్నులు

ఆంధ్రజ్యోతి పైత్యం: 

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు తీసుకురావాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ సంస్థలకూ ప్రాజెక్టులో భాగస్వామ్యాన్ని కల్పిస్తుందట. టర్న్‌కీ పద్ధతిలో టెండర్ల నిర్వహణలో ప్రపంచ బ్యాంకు పోకడలకు తెరలేపిందట. రైతుల నుంచి యూజర్‌ చార్జీలు, పన్నులు, సర్‌చార్జీలు వసూలు చేయనున్నారని వంట వండింది. 

ఇదీ వాస్తవం:: నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా పోరాడి తెలంగాణ సాధించారు. అలాంటిది తెలంగాణ రైతుకు సాగునీళ్లు అందించేందుకు చార్జీలు, బిల్లులు వసూలు చేస్తారనే అసత్య ప్రచారాన్ని చేసే దుస్సాహసానికి ఆంధ్రజ్యోతి పూనుకుంది. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకురావాలంటే కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలి. అందుకు అనుగుణంగానే కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, రికార్డు సమయంలో.. సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూలేని విధంగా కేవలం మూడేండ్లలోనే కాళేశ్వరాన్ని ప్రభుత్వం సాకారం చేసింది. దీనిద్వారానే గోదావరి జలాల వినియోగం పెరిగింది. రికార్డుస్థాయిలో వరి సాగయింది. 

కరెంటు పై తప్పుడు కథనాలు.. 24 గంటల విద్యుత్‌తో సంబురాలు

2014 ఆగస్టు, 06  

మిగిలింది ‘ఏడు’పే - ఏడు గంటల కరెంటు ఒట్టిమాటే

2014 అక్టోబరు, 28

పద్మవ్యూహంలో అభిమన్యుడు రైతు! - కరువైన సర్కారు మద్దతు

ఆంధ్రజ్యోతి పైత్యం: 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏడు గంటల కరెంటు ఇస్తానన్నది కానీ నాలుగైదు గంటలు కూడా సరిగా రావడం లేదు. రైతులకు ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. అంతేకాదు.. సర్కారు మద్దతు లేకపోవడంతో తెలంగాణ రైతు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారిపోయాడట. 

ఇదీ వాస్తవం: 

తెలంగాణ రాష్ట్రం 2014, జూన్‌ 2న ఏర్పడింది. ఆ రోజే తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించారు. మరి నెల రోజుల్లోనే రైతుల ఏడుపుకు ముఖ్యమంత్రి కారణమయ్యాడా? నిన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో అర్జునుడిలా ఉన్న తెలంగాణ రైతు రెండు, మూడు నెలలకే పద్మవ్యూహంలోని అభిమన్యుడిగా మారాడా? పాత పాపాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఖాతాలో వేసి.. తెలంగాణలో పాలన సరిగా లేదని ముద్ర వేసే ఆత్రుత ఇది. ఇవే కాదు.. తెలంగాణ ప్రభుత్వం కుదురుకోక ముందే రైతుల ఆత్మహత్యలు అంటూ అంకెల గారడీతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నవ్విన నాప చేనే పండినట్టు అనేక కథనాలతో ఆంధ్రజ్యోతి గతంలో అక్షర సంబురాలు చేసుకోవచ్చుగానీ, ఇప్పుడు నిజంగా తెలంగాణ రైతు పచ్చని పొలాల్లో సంబురాలు చేసుకుంటున్నాడు. 

నియంత్రితసాగుపైనా ఏడుపే.. జై కొట్టిన రైతులు

2020 మే, 16  

సందేహాల సాగు - బహుళ పంటల సాగు క్షేత్రస్థాయిలో అమలయ్యేనా? 

ఆంధ్రజ్యోతి పైత్యం: 

తెలంగాణ ప్రభుత్వం ఒకటి ఆశిస్తే... అందుకు భిన్నంగా జరగాలనేది ఆంధ్రజ్యోతి అత్యాశ. అందుకే ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత సాగు అమలులో సాధ్యం కాదంటూ ముందే తేల్చే ప్రయత్నం. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సాగు సందేహాల నడుమ చిక్కుకుని విలవిలలాడుతుందనేది కథన సారాంశం. అసలు ప్రభుత్వం అప్పటికి సాగు విధానం, విస్తీర్ణాన్ని ప్రకటించనేలేదు. మథనం జరుగుతున్న సమయంలోనే, ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు పడిన తంటా ఇది. 

జరిగిన వాస్తవం: ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే నియంత్రిత సాగు విధానంపై కసరత్తు మొదలుపెట్టింది. తగిన సమయంలోనే ప్రకటన చేయడంతోపాటు అందుకు తగిన వసతులు, విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి రైతుల్లోనూ అవగాహన కల్పించింది. అంతకుమించి సీఎం కేసీఆర్‌ పట్ల రైతులకున్న నమ్మకం దృష్ట్యా... ఆయన ప్రకటించిన నియంత్రిత సాగు విధానం తొలి దఫాలోనే విజయవంతం అయ్యిందనేది ఇప్పుడు కండ్ల ముందున్న సత్యం. మక్కజొన్నను గతఏడాది ఏడు లక్షల ఎకరాలకు పైగాసాగు చేసిన రైతులు ఇప్పుడు ప్రభుత్వం మాటమేరకు నామమాత్రంగా సాగుచేయడం నియంత్రిత సాగు విజయానికి ప్రతీకే కదా?

హైదరాబాద్‌పై కుట్రలు.. పటాపంచలు

2014 ఆగస్టు, 09

రాజ్‌భవన్‌ చేతికి రాజధాని - హైదరాబాద్‌పై అధికారాలు, బాధ్యతలు ఆయనకే 

ఆంధ్రజ్యోతి పైత్యం: రాష్ట్రం విడిపోయినా.. చంద్రబాబు ఆత్మ హైదరాబాద్‌ చుట్టూనే తిరిగినట్లు! రాధాకృష్ణ రాతలు హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేసేందుకే సాగాయి. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో హైదరాబాద్‌ అధికారాలు, బాధ్యతల్ని రాజ్‌భవన్‌ ద్వారా టీడీపీ మిత్రపక్షమైన కేంద్రంలో బీజేపీ చేతుల్లోకి వస్తే.. తమ చేతుల్లోకి వచ్చినట్లేనన్న భ్రమల్లో అనేక కథనాలు వండి వార్చారు. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసి.. ఇక రాజధాని బాధ్యతల్ని గవర్నర్‌కు అప్పగించండంటూ ఆదేశించినట్లుగా ముందు పేజీలను తీర్చిదిద్దారు. 

జరిగిన వాస్తవం: ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే నియంత్రిత సాగు విధానంపై కసరత్తు మొదలుపెట్టింది. తగిన సమయంలోనే ప్రకటన చేయడంతోపాటు అందుకు తగిన వసతులు, విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి రైతుల్లోనూ అవగాహన కల్పించింది. అంతకుమించి సీఎం కేసీఆర్‌ పట్ల రైతులకున్న నమ్మకం దృష్ట్యా... ఆయన ప్రకటించిన నియంత్రిత సాగు విధానం తొలి దఫాలోనే విజయవంతం అయ్యిందనేది ఇప్పుడు కండ్ల ముందున్న సత్యం. మక్కజొన్నను గతఏడాది ఏడు లక్షల ఎకరాలకు పైగాసాగు చేసిన రైతులు ఇప్పుడు ప్రభుత్వం మాటమేరకు నామమాత్రంగా సాగుచేయడం నియంత్రిత సాగు విజయానికి ప్రతీకే కదా?

ఇదీ వాస్తవం: నిజానికి హైదరాబాద్‌లోని సీమాంధ్రులపై ఏ ఒక్క చిన్న దాడి జరిగినా దానిని భూతద్దంలో చూపి.. హైదరాబాద్‌ను కేంద్రం చేతిలో పెట్టాలనేది చంద్రబాబు అండ్‌ కో పన్నాగం. ఆ బ్యాచులోని ఆర్కే కూడా ఇదేరీతిన తన రాతల్ని కొనసాగించాడు. కానీ మునుపటి కంటే ప్రశాంతంగా సీమాంధ్రులు హైదరాబాద్‌లో గడపడాన్ని ఇప్పటికీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రజ్యోతి రాసినట్లు అప్పట్లోనే కేంద్ర హోం శాఖ గవర్నర్‌ చేతికి హైదరాబాద్‌ పగ్గాలు ఇచ్చిందా? అంతేకాదు ఆర్కే తన కథనంలో సిటీ పోలీసు విభాగం తన చేజారి పోయిందని తెలంగాణ ప్రభుత్వం భావించిందంటూ రాసుకొచ్చాడు. మరి సిటీ పోలీసు విభాగం ఈ ఆరేండ్లు తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పని చేసిందా? రాజ్‌భవన్‌లో ఆధీనంలో పని చేసిందా?

సమగ్ర సర్వేను ఎకసెక్కంచేశారు.. పార్లమెంటే ప్రశంసించింది

2014 ఆగస్టు, 14

సర్వే ఎందుకు? - తెలంగాణ రాష్ర్టాన్ని వివరణ కోరిన కేంద్రం చట్టబద్దత ఉందా? - సమగ్ర సర్వే రాజ్యాంగ విరుద్ధమనే వాదనలు

ఆంధ్రజ్యోతి పైత్యం: 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014 ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిని చిలువలు పలువలు చేస్తూ ఆంధ్రజ్యోతి రాసిన కథనాలివి. అసలు సర్వే ఎందుకని కేంద్రం గద్దించిందని, పలు సంస్థలు, ఏపీ ఎంపీల ఫిర్యాదుతో కేంద్రం.. రాష్ర్టాన్ని వివరణ కోరిందని రాసుకొచ్చారు. అంతేనా?! అసలు ఈ సర్వేకు చట్టబద్ధత ఉన్నదా? అని సొంత పైత్యాన్ని ఒలకబోశారు. ఇది రాజ్యాంగ విరుద్దమంటూ పలువురితో చెప్పించి మరో కథనాన్నీ ఇచ్చారు. 

ఇదీ వాస్తవం:  అరవై ఏండ్ల తర్వాత స్వరాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ ఎట్ల ఉన్నది? నిధుల సరళి ఎలా ఉండాలి? పథకాల రూపకల్పన, అమలు ఎట్లా చేయాలి? ఇలా అసలు తెలంగాణ ముఖచిత్రాన్ని అర్థం చేసుకునే పాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే ఇది. ఒక్కరోజులో తెలంగాణ సమాజం యావత్తు ఏకతాటిపై నిలిచి దేశాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తే రీతిలో విజయవంతమైన సర్వే. ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పిలుపునిస్తే ప్రజల స్పందన ఎంత అనూహ్యంగా ఉంటుందో, ఆయనపై ప్రజల్లో ఎంత నమ్మకముందో రుజువు చేసింది. విమర్శించిన నోళ్లు, అడ్డదిడ్డంగా రాసిన చేతులు సైతం ఈ సర్వేలో పాల్గొన్నాయి. గత ఏడాది జూన్‌ ఐదో తేదీన పార్లమెంటులో ప్రవేశప్టెన ఎకనమిక్‌ సర్వే.. తెలంగాణ సమగ్ర సర్వేను వేనోళ్ల పొగిడింది. లండన్‌, అమెరికా డాటాతోపాటు తెలంగాణ సమగ్ర సర్వేను కూడా హైలెట్‌ చేసింది. 


logo