గురువారం 28 జనవరి 2021
Telangana - Oct 24, 2020 , 02:03:45

రైతు వేదికకు 12 లక్షల విరాళం

రైతు వేదికకు 12 లక్షల విరాళం

నిజాంపేట: మెదక్‌ జిల్లా నిజాంపేటలో రైతు వేదిక నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త, ఏపీఆర్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు అందె ప్రతాప్‌రెడ్డి రూ.12 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్‌కు చెక్కును తన వ్యక్తిగత కార్యదర్శి నరేందర్‌రెడ్డి ద్వారా అందజేశారు. నిజాంపేట మండలం కాసింపూర్‌కు చెందిన అందె ప్రతాప్‌రెడ్డి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఏపీఆర్‌ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విరాళం అందజేసిన ప్రతాప్‌రెడ్డికి నిజాంపేట జెడ్పీటీసీ విజయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.


logo