బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 02:38:59

పురాతన నాగన్న బావికి పూర్వవైభవం తెస్తాం: పురావస్తుశాఖ

పురాతన నాగన్న బావికి పూర్వవైభవం తెస్తాం: పురావస్తుశాఖ

లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేటలోని పురాతన నాగన్న బావికి పూర్వవైభవం తెస్తామని పురావస్తుశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజు చెప్పారు. నాగన్నబావి చారిత్రక నేపథ్యంపై మే18న ‘నమస్తే తెలంగాణ’లో ‘వావ్‌..తెలంగాణ రాణీకీ వావ్‌' శీర్షిక వచ్చిన కథనంపై స్పందించారు. మంగళవారం పురాతన బావి, హనుమాన్‌ ఆలయంలో నంది, వినాయకుడు, శివలింగాలను పరిశీలించి, వాటిని 12, 13వ శతాబ్దం లో ఏర్పాటుచేసినట్టు నాగరాజు తెలిపారు. బావి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆయనవెంట పురావస్తు పరిశోధనశాఖ అధికారి భానుమూర్తి, చౌకిదార్‌ లక్ష్మణ్‌, పంచాయతీ ఈవో రవీందర్‌రావు, స్థానికులు బొల్లు శ్రీకాంత్‌, రాజేశ్‌గౌడ్‌  వంశీ, శశిప్రీతం, దిలీప్‌, బట్టు సాయిలు తదితరులు ఉన్నారు. 


logo