శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 21:55:58

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన యాంకర్ ఉదయశ్రీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన యాంకర్ ఉదయశ్రీ

హైదరాబా‌ద్‌ :   పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాలన్న నినాదంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడుత స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోంది. యాంకర్ ధరణి ప్రియ విసిరిన గ్రీన్‌ఛాలెంజ్ను స్వీకరించిన సహచర యాంకర్ ఉదయశ్రీ శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు. అనంతరం ఆమె  మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.

ఎంపీ సంతోశ్‌కుమార్‌ ఉన్నత లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పచ్చదనం పెంపునకు అందరూ మొక్కలు నాటాలని కోరారు. ఆర్జేలు శివ, సునీత, హేమంత్, నటుడు సమీర్లకు ఆమె చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిశోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.
logo