మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:34:45

మీ మాట తీరు అద్భుతం

మీ మాట తీరు అద్భుతం

  • మంత్రి కేటీఆర్‌తో సంభాషణపై యాంకర్‌ సుమ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రసంగం ఎంతో హుందాగా, ఆకట్టుకొనేలా ఉంటుందని ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రశంసించారు. కేటీఆర్‌ను కలిసిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌చేసిన ఆమె ‘మీతో (కేటీఆర్‌) మాట్లాడటం చాలా ఆనందంగా ఉన్నది. సాధారణంగా నా షోల్లో నాన్‌స్టాప్‌గా ఏదో ఒకటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటా. కానీ నాయకత్వ హోదాలో మీరు మీట్లాడే విధానం వినడానికి ఎంతో విలువైందిగా ఉంటుంది’ అని ట్వీట్‌ చేశారు. ‘మీ నిబద్ధత, మీరు మాట్లాడే విధానం అద్భుతమని’ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేస్తూ ‘సుమతో మాట్లాడడాన్ని ఎంతో ఆస్వాదించాను. మా మధ్య సంభాషణలను చూసినవారు ఎంతో ఆనందపడతారు’ అని పేర్కొన్నారు. సుమ కొన్నేండ్లుగా టీవీ యాంకర్‌గా ప్రజల మనసులను దోచుకుంటున్నారు. ఆమె గలగలా మాట్లాడడాన్ని ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారు. ఆమె ఇటీవల సుమక్క పేరుతో ఓ యూట్యూబ్‌ చానల్‌ కూడా ప్రారంభించారు. ఇక్కడ కూడా తన వాక్చాతుర్యంతో రాణిస్తున్నారు.