గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 11, 2020 , 01:42:26

యాంకర్‌ అనసూయపై అసభ్యకర పోస్టులు

యాంకర్‌ అనసూయపై అసభ్యకర పోస్టులు
  • ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు..
  • వెంటనే స్పందించిన సైబర్‌క్రైం పోలీసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  సోషల్‌మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలుచేయడంతోపాటు అసభ్యకర ఫొటోలు పోస్టుచేశారంటూ ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ట్విట్టర్‌ ద్వారా హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై వెంటనే స్పందించిన సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు .. ఆయా అసభ్యకర పోస్ట్‌లను తొలిగించి, అవి పెట్టినవారి వివరాలు ఇవ్వాలని సంబంధిత సంస్థకు నోటీసులు జారీచేశారు. దీంతో అనసూయతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన ఇతరులపై పెట్టిన అభ్యంతరకర పోస్టులను కూడా ట్విట్టర్‌ నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై బాధితురాలు లేదా ఆమె తరఫున ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కువచ్చి ఫిర్యాదుచేస్తే కేసు నమోదుచేసి, సమగ్ర దర్యాప్తుచేస్తామని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 
logo