మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 15:16:21

ఆనంద్ మృతదేహం లభ్యం ..

ఆనంద్ మృతదేహం లభ్యం ..

సంగారెడ్డి : అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుక బావి వద్ద గత మంగళవారం రాత్రి వరద ప్రవాహంలో కారుతో సహా గల్లంతైన ఆనంద్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆదివారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే కారుతో సహా మృతదేహం లభించింది. సంఘటన జరిగిన నాటి నుంచి గత ఆరు రోజులుగా 24 గంటల పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి మృతుడి కుటుంబానికి భరోసా కల్పించారు. ఆనంద్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.logo