శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 02:27:30

వంతెన కింద శవం

వంతెన కింద శవం

  • గుర్తుతెలియని మహిళ దారుణహత్య 
  • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
  • లైంగికదాడి జరుగలేదని ప్రాథమిక అంచనా
  • చేవెళ్లలోని తంగడిపల్లి వంతెన వద్ద ఘటన

చేవెళ్ల: గుర్తుతెలియని వివాహిత దారుణహత్యకు గురైంది. మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు ఆమె ము ఖాన్ని బండరాయితో మోదినట్టు పోలీసులు గుర్తించారు. సదరు మహిళను ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి పడేశారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా  రం.. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తం గడిపల్లి వంతెన కింది భాగంలో 30-35 ఏండ్ల వివాహిత దారుణహత్యకు గురయింది. నగ్నంగా ఉన్న మృతదేహంపై నగలు ఉన్నాయి. ముఖం ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో మోదడంతో.. వంతెన గోడలకు రక్తం చుక్కలు చిందాయి. వంతెన పైభాగంలో తాడు దొరుకడంతో మహిళను చంపి తీసుకొచ్చి వంతెన కిందకు దానితో దింపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

తెల్లవారుజామున 2-3 గం టల మధ్య హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన స్థానిక యువకుడు మహిళ మృతదేహాన్ని చూసి గ్రామస్థుల ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.  డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ శ్యాం బాబు, ఎస్వోటీ అదనపు డీసీపీ సందీప్‌కుమార్‌ ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. డాగ్‌స్కా డ్‌, క్లూస్‌టీంలు వివరాలు సేకరించాయి. లైంగికదాడి జరుగలేదని, వివాహేతర సంబంధం హత్యకు కారణమై ఉండొచ్చ ని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

నాలుగు క్లూస్‌టీంలతో విచారణ

హత్య కేసును ఛేదించేందుకు నాలుగు క్లూస్‌టీంలను ఏర్పాటుచేసినట్టు ఏసీపీ రవీందర్‌రెడ్డి చెప్పారు. వీలైనంత త్వరగా హత్యకు గల కారణాలను సేకరించి నిం దితులను పట్టుకొంటామన్నారు. మృతిరాలి ఒంటిపైనుంచి రెండు బంగారుగాజులు, గొలుసు, ఉంగరం స్వాధీనం చేసుకొన్నట్టు తెలిపారు.

విషయం ఊళ్లో చెప్పా: నవీన్‌

‘ఉదయం 7 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లగా సమీపంలోని వంతెన కింద బొమ్మ మాదిరిగా కనిపించింది. దగ్గరకెళ్లి చూడగా నగ్నంగా ఉన్న మహిళ చనిపోయి ఉన్నది. వెంటనే గ్రామస్థులకు సమాచారమిచ్చా. గ్రామస్థులు చేవెళ్ల పోలీసులకు సమాచారమందించారు’ అని గ్రామస్థుడు నవీన్‌ తెలిపారు.

మహారాష్ట్ర లేక రాజస్థాన్‌? 

మృతదేహంపై కనిపించిన గుర్తులు సాధారణంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన మహిళల శరీరంపైనే కనిపిస్తాయని పోలీసులు చెప్తున్నారు. ఆమె గాజులు, చైన్‌, ఉంగరాన్ని బట్టి మృతురాలు ఆయా రాష్ర్టాలకు చెందిన వ్యక్తిగా భావిస్తు న్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. తంగడిపల్లి మీదుగా వచ్చిపోయే మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు. తంగడిపల్లి పరిసరాల్లో సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తుల మొబైల్‌ ఫోన్లకు అందిన సిగ్నల్స్‌ను ట్రాక్‌ చేసేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఉత్తరాది రాష్ర్టాల నుంచి వలస వచ్చి హైదరాబాద్‌ శివారులో నివసిస్తూ ఉండొచ్చని, ఒంటిపై దుస్తులు తొలిగించడం ద్వారా దృష్టి మరల్చే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. మహిళను ఎక్కడ చంపారు? వేరే ప్రాంతంలో చంపి తీసుకొచ్చి పడేశారా? ఎందుకు చంపాల్సి వచ్చింది? హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


logo