శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 24, 2020 , 02:20:57

గల్ఫ్‌ బాధితుడికి ఆపన్న హస్తం

గల్ఫ్‌ బాధితుడికి ఆపన్న హస్తం

  • సౌదీలో ఇందూరు వాసికి పక్షవాతం
  • మాజీ ఎంపీ కవిత చొరవతో ఇంటికి.. 

జక్రాన్‌పల్లి: బతుకుదెరువుకు గల్ఫ్‌ వెళ్లి పక్షవాతంతో బాధ పడుతున్న వ్యక్తికి నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండ లం బాల్‌నగర్‌కు చెందిన బూక్య దశరథ్‌(లంబాడి శంకర్‌) ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. అక్కడ పక్షవాతం రావడంతో దవాఖానలో చేరాడు. ఈలోపు అతడి వీసా గడువు ముగియడంతో స్వగ్రామానికి తిరిగిరాలేని పరిస్థితి. కవిత సూచన మేరకు సౌదీ జాగృతి అధ్యక్షుడు మౌజంఅలీ ఇఫ్తేకార్‌.. దశరథ్‌, అతడి సహాయకుడు స్వగ్రామానికి రావడానికి రూ.55 వేలతో విమాన టికెట్లను బుక్‌చేశారు. గురువారం  దశరథ్‌  హైదరాబాద్‌ చేరుకోగా, కవిత ఫోన్‌లో పరామర్శించారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి తదితరులు దశరథ్‌ను స్వ యంగా ఇంటికి తీసుకొచ్చారు. ఆపదలో అండగా నిలిచిన మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డికి దశరథ్‌ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.  


logo