శనివారం 04 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 00:53:09

కన్నతల్లినే రోడ్డున పడేశారు

కన్నతల్లినే రోడ్డున పడేశారు

  • ఆస్తి కోసం ఉన్న గుడిసెనూ కూల్చారు
  • పంచాయతీ భవనంలో తలదాచుకుంటున్న వృద్ధురాలు 

పెద్దపల్లి జంక్షన్‌: కన్నతల్లి అన్న మమకారం లేదు.. పండు ముసలి అనే జాలి లేదు..ఆస్తికోసం ఉన్న గుడిసెను కూల్చేసి నిలువ నీడలేకుండా రోడ్డున పడేశారు. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామానికి చెంది న గుమ్మడి రాధమ్మ(80)కు ఇద్దరు కొడుకులు నారాయణ, సదయ్య. రాధ మ్మ భర్త ఏడేళ్ల కిందటే చనిపోయాడు. తనకున్న 4 ఎకరాలను ఇద్దరు కొడుకులకు ఇచ్చి ఆమె చిన్న గుడిసెలో ఉంటున్నది. అయితే మరో రెండెకరాలు పరంపోగు భూమి ఉన్నది. దానిని కూడా పంచాలని ఇద్దరు కొడుకులు కొద్దిరోజులుగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చిన్న కొడుకు సదయ్య తల్లి ఉంటున్న గుడిసెను కూల్చేసి బయటకు పంపాడు. పెద్ద కొడుకు నారాయణ ఊర్లోనే ఉంటున్నా చేరదీయలేదు. దీంతో ఆ వృద్ధురాలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకుంటున్నది. తనకు న్యాయం చేయాలంటూ కనిపించినా వారినల్లా వేడుకుంటున్నది. 


logo