గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:10:21

మూడెకరాలిచ్చిన.. బువ్వ పెడ్తలేడు

మూడెకరాలిచ్చిన.. బువ్వ పెడ్తలేడు

  • కొడుకు పట్టించుకోవట్లేదని   ఆర్డీవోకు ఓ వృద్ధురాలి మొర 

చౌటుప్పల్‌: ఉన్న మూడెకరాలు కొడుకుకు పట్టా చేయించినా.. ఇప్పుడు బుక్కెడు బువ్వ కోసం తిప్పలు పడుతున్నా సారు న్యాయం చేయండి అంటూ ఓ వృద్ధురాలు మంగళవారం చౌటుప్పల్‌ ఆర్డీవోను ఆశ్రయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడేనికి చెందిన సుర్కంటి సత్తమ్మ(70) భర్త రాంరెడ్డి ఏడేండ్ల క్రితం మరణించాడు. దీంతో కొడుకు మల్లారెడ్డి, కోడలు అమృతతో కలిసి ఉంటున్నది. భర్త పేర ఉన్న మూడెకరాలు కొడుకు పేరిట పట్టా చేయించింది. కొంతకాలం బాగానే చూసుకొన్న కోడలు వారం రోజులు గా తిండి పెట్టకుండా వేధిస్తున్నది. దీంతో ఆమెకు గ్రామస్థులే అన్నం పెడుతున్నారు. సత్తమ్మకు అన్నం పెడుతున్న వారిని కోడలు తిడుతుండడంతో వృద్ధురాలు మంగళవారం ఆర్డీవో సూరజ్‌కుమార్‌కు తన గోడును వెళ్లబోసుకున్నది. వృద్ధురాలి కొడుకు, కోడలిని పిలిపించి మాట్లాడిన ఆర్డీవో సత్తవ్వ బాగోగులు చూసుకోవాలని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. 


logo