బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 02:33:14

ఇక్కడి చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌

ఇక్కడి చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌

  • ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
  • మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/కరీంనగర్‌ కార్పొరేషన్‌: రానున్న రోజుల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉత్పత్తి చేసిన చేపలను హైదరాబాద్‌ లేదా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సారార్‌ జలాశయంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి 5 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.  ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల చేప పిల్లలను ఆయా ప్రాజెక్టుల్లో ఉచితంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. logo