గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:50:35

అవమానిస్తే ఫిర్యాదు చేయండి

అవమానిస్తే ఫిర్యాదు చేయండి

  • కొవిడ్‌ విజేతల కోసం పీఎస్‌లో ఓ ఎస్సై
  • రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ భరోసా

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ పాజిటివ్‌ నుంచి బయటపడ్డారా? మీ చుట్టుపక్కల వారినుంచి అవమానకరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మిమ్మల్ని అంటరానివారిగా చూస్తున్నారా? ఒక్క ఫోన్‌చేయండి. పోలీసులు స్వయంగా వచ్చి సమస్య పరిష్కరిస్తారని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సీపీ మహేశ్‌ భగవత్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్‌ విజేతల సమస్యను పరిష్కరించేందుకు కమిషనరేట్‌ పరిధిలోని 43 శాంతిభద్రతల పోలీసు స్టేషన్లలో ఒక్కో ఎస్సై చొప్పున కేటాయించారు. ఇలాంటి ఇబ్బందులతో స్థానిక స్టేషన్‌కు ఫోన్‌చేస్తే ఎస్సై అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు. వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని మహేశ్‌భగవత్‌ తెలిపారు. కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు జరగకుండా చేస్తే కూడా స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి సమస్యలు వస్తే పోలీసులు పరిష్కారం చూపారని తెలిపారు. ఎదుటివారిని అవమానపరిచే, కించపరిచే అధికారం ఎవరికీ లేదని స్పష్టంచేశారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు నిర్లక్ష్యంగా బయట తిరిగితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

తాజావార్తలు


logo