ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 15:53:16

చూసేకొద్ది కనులవిందు : ఎంపీ సంతోష్‌ కుమార్‌

చూసేకొద్ది కనులవిందు : ఎంపీ సంతోష్‌ కుమార్‌

హైదరాబాద్‌ : చిత్రకారులు.. మనసుకు హాయైన, ప్రశ్నించే విధంగా, ఆలోచింపజేసేలా, సందేశాన్నిచ్చేలా ఇలా పలు రకాలుగా తమలోని భావాలను, ప్రతిభను క్యాన్వాస్‌లపై వ్యక్తపరుస్తుంటారు. అదేవిధంగా సమకాలీన సమాజ పోకడలకు అనుగుణంగా దృశ్యాలను చిత్రీకరిస్తుంటారు. ప్రకృతిలో మనస్సుకి హాయైన దృశ్యాలను చూసే కొద్ది చూడాలనిపిస్తుంటుంది ఎవరికైనా. ఇటువంటి కొన్ని దృశ్యాలను చిత్రకారులు తమ పనితనంతో బంధిస్తుంటారు. అటువంటి ఓ చిత్రాన్ని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా నెటిజన్స్‌తో పంచుకున్నారు. ఓ ఆర్టిస్ట్‌ ఆకుపై తెలంగాణ రాష్ట్ర పటాన్ని, సీఎం కేసీఆర్‌ చిత్రాన్ని, మాస్క్‌ ధరించిన ఓ వ్యక్తి ముఖాన్ని, ఎంపీ సంతోష్‌ కుమార్‌ పేరును, దయచేసి మాస్క్‌ ధరించండి అనే నినాదాన్ని చిత్రీకరించాడు. రాష్ర్టానికి రక్షగా సీఎం కేసీఆర్‌ ఉన్నారని, కరోనా నుంచి రక్షించుకునేందుకు ఎవరివారు మాస్కులు ధరించాల్సిందిగా ఉన్న ఈ చిత్రం చూడచక్కగా ఉందని సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఇంత అద్భుత ప్రతిభ చూపిన ఆర్టిస్టుకి అభినందనలు తెలిపారు. ప్రతిఒక్కరిని ఆలోచింపజేసే విధంగా చిత్రకారుడు చిత్రాన్ని గీశాడని కొనియాడారు. దీన్ని లీఫ్‌ ఆర్ట్‌ అద్దామా లేక ఇంకేదైనా పేరుతో పిలువండి కానీ ఇది ఎంతో ఆకర్షించేవిధంగా ఉందన్నారు. చాలా మంచి సందేశం అందజేస్తుందన్నారు. కోవిడ్‌-19 నుంచి మనల్ని మనం రక్షించేందుకు ఎల్లప్పుడు మాస్క్‌ను ధరించాల్సిందిగా ఎంపీ పేర్కొన్నారు.


logo