శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:59

కరోనా నుంచి కోలుకున్న బిగ్‌బీ.. అబద్ధం

కరోనా నుంచి కోలుకున్న బిగ్‌బీ.. అబద్ధం

గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కు తాజా టెస్టు రిపోర్టులో నెగెటివ్‌ వచ్చిందని, వ్యాధి నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారని ‘టైమ్స్‌ నౌ’ వంటి జాతీయ మీడియాలో గురువారం ఓ వార్త ప్రసారమైంది. 

దీనిపై బిగ్‌బీనే స్వయంగా స్పందించారు. మీడియాలో ప్రసారమవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని, తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు.


logo