గురువారం 16 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:07:59

ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తకు అమెరికా అవార్డు

ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తకు అమెరికా అవార్డు

  • భారత్‌ నుంచి అవార్డు పొందిన తొలి వ్యక్తి సుబ్బారావు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ సుబ్బారావును అమెరికాకు చెందిన పోషకాహార సంస్థ (ఏఎస్‌ఎన్‌) ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు లభించిన మొట్టమొదటి భారతీయుడు సుబ్బారావు అని ఎన్‌ఐఎన్‌ ప్రకటించింది.  పోషకాహారంపై అవగాహన కల్పించడంతోపాటు బిహేవియర్‌ సైన్స్‌ విభాగంలో డాక్టర్‌ సుబ్బారావు కృషి చేస్తున్నారు. మిడ్‌ కెరీర్‌ విభాగం-2020కిగాను సుబ్బారావును ఎంపికచేసిన ఏఎస్‌ఎన్‌ మంగళవారం లైవ్‌ కాన్ఫరెన్స్‌లో అవార్డును అందజేసింది. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌  హైదరాబాద్‌కు సంబంధించి న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఫెల్లోగా కూడా ఆయన పనిచేశారు. 


logo