బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 01:53:21

ఆయుధాల ఎగుమతిలో అమెరికా ఫస్ట్‌!

ఆయుధాల ఎగుమతిలో అమెరికా ఫస్ట్‌!
  • సగం ఆయుధాలు మధ్య ప్రాచ్యానికే

స్టాక్‌హోం: అంతర్జాతీయ ఆయుధాల వ్యా పారం ఐదేండ్లలో వృద్ధి చెందింది. ఆయుధాల విక్రయంలో రష్యాపై అమెరికా ఆధిప త్యం ప్రదర్శించిందని స్టాక్‌హోం అంతర్జాతీ య శాంతి పరిశోధనా సంస్థ (సిప్రీ) పేర్కొ న్నది. 2010-15 మధ్యకాలంతో పోలిస్తే 2015-19లో అంతర్జాతీయ ఆయుధ ఎగుమతులు 5.5శాతం పెరిగాయని సిప్రీ సీనియర్‌ పరిశోధకుడు పీటర్‌ వెజెమన్‌ తెలిపా రు. 96 దేశాలకు అమెరికా ఆయుధాలను ఎగుమతిచేసింది. 2015-19 మధ్య కాలం లో అమెరికా విక్రయాలు 23శాతం పెరిగా యి. అంతర్జాతీయ ఆయుధాల ఎగుమతు ల్లో తన వాటాను అమెరికా 36శాతానికి పెంచుకున్నది. అమెరికా ఆయుధ ఎగుమతుల్లో సగం మధ్య ప్రాచ్యానికే సాగితే.. అందులో సగం సౌదీ అరేబియాకు వెళ్లాయి. 2010-14తో పోలిస్తే 2015-19 మధ్య సౌదీ అరేబియా ఆయుధ దిగుమతులు 130 శాతమైతే.. అంతర్జాతీయ ఆయుధాల దిగుమతిలో ఇది 12శాతం. ఇక అంతర్జాతీయ ఆయుధాల ఎగుమతిదారుల్లో రెండో స్థానంలో ఉన్న రష్యా నుంచి భారత్‌కు విక్రయాలు భారీగా తగ్గాయి. భారత్‌ దిగుమతులు 32శాతం, పాకిస్థాన్‌ దిగుమతులు 39శాతానికి పడిపోయాయి. ఫ్రాన్స్‌ ఎగుమతులను 72శాతం పెంచుకున్నది. వాటిల్లో సగానికి పైగా ఈజిప్ట్‌, ఖతార్‌, భారత్‌కు ఎగుమతి కాగా.. వీటిలో అత్యధికం రాఫెల్‌ యుద్ధ విమానాలే కావడం గమనార్హం. logo
>>>>>>