ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 11:39:26

21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మం ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ఆ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. శ‌నివారం మరో 21 అంబులెన్సులను ప్ర‌భుత్వానికి విరాళంగా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు అంజేశారు.ఈ అంబులెన్స్‌లను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. 

మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి మూడు అంబులెన్స్‌ల చొప్పున ఎంపీలు శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి మూడు అంబులెన్స్‌ల చొప్పున, మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేందర్, ఆరూరీ ర‌మేశ్, ఉపేందర్ రెడ్డి, విన‌య్ భాస్క‌ర్, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, వరంగ‌ల్‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్ రావు ఒక్కొ అంబులెన్స్ చొప్పున అంద‌జేశారు. 

మహబూబ్ నగర్, హైదరాబాద్ కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులను వినియోగించనున్నారు.


logo