శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 13:59:14

కరోనా బాధితుల‌కు 24 గంట‌లు అందుబాటులో అంబులెన్స్ లు

 కరోనా బాధితుల‌కు 24 గంట‌లు అందుబాటులో అంబులెన్స్ లు

మహబూబాబాద్ : క‌రోనా బాధితుల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడిన అంబులెన్స్ వాహ‌నాన్ని అందిస్తున్నట్లు పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో క‌లిసి మంత్రి అంబులెన్స్ వాహ‌న తాళం చెవిని తొర్రూరు వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమ‌మార్ కు అందించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. క‌రోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మ‌రింత అప్రమత్తంగా ఉండాల‌న్నారు. మంత్రి కేటీఆర్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గిఫ్ట్‌ ఎ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి 14 వాహ‌నాల‌ను ఇచ్చిన‌ట్లు మంత్రులు తెలిపారు. వీటిలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వాహ‌నాల‌ను అందజేస్తున్నట్లు వారు తెలిపారు. అంబులెన్స్ లను ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే విధంగా చూసుకోవాల‌ని సంబంధిత వైద్యాధికారికి మంత్రులు సూచించారు. 


logo