శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 14:17:58

గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా అంబులెన్స్ ఇచ్చిన ఎమ్మెల్సీ

గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా అంబులెన్స్ ఇచ్చిన ఎమ్మెల్సీ

హైద‌రాబాద్‌: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న‌ద‌ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఈ కార్య‌క్ర‌మం‌లో భాగంగా సొంత డ‌బ్బుతో ప్ర‌భుత్వానికి అంబులెన్సును అందిస్థాన‌ని ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన మొత్తాన్ని చెక్ రూపంలో టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్‌కు ప్రగతి భవన్‌లో అందించారు. 

మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సంద‌ర్భంగా సొంత నిధులతో ఆరు అంబులెన్సులను ప్రభుత్వానికి అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను కూడా అంబులెన్సు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని శంభీపూర్ రాజు వెల్లడించారు. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషించ‌ద‌గిన‌ విషయమని చెప్పారు.


logo