మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 11:36:53

ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై సందిగ్ధత

ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై సందిగ్ధత

హైదారబాద్ : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. బసుస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమవ్వగా టీఎస్‌ ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదు. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు జరిపారు. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది.


logo