బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 16:10:18

దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి : వినోద్ కుమార్

దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి : వినోద్ కుమార్

హైదరాబాద్ : దళితుల విద్య పట్ల అంబేడ్కర్ కు ఉన్న దూర దృష్టి ఉంతో ఉన్నతమైంది. నేటి ప్రజాస్వామ్యం  పరిఢవిల్ల చేయడంలో  అంబేద్కర్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. డా. బీ.ఆర్. అంబేద్కర్ - దళిత విద్య కోసం అతని దూర దృష్టి అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి వెబినార్ వెబినార్ లో  ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ దళితుల విద్య , ఉపాధి గురించి ఎప్పుడూ శ్రద్ధ వహించేవాడని తెలిపారు. విద్య ద్వారానే మెరుగైన సమాజం ఏర్పడుతుందని అందుకోసం ఆయన ఎంతో శ్రమించారని పేర్కొన్నారు.

దళితులు ఇతర అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని వినోద్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. వీ. రమణారావు, అస్సాం విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ తెనేపల్లి హరి, ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్, డాక్టర్ ఎం.హీరలాల్, డాక్టర్ ఎ. బెనర్జీ బాబు, ఇతర విశిష్ట అతిథులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.


logo